Viral Video : ఈ కుర్రాడి టాలెంట్ తగలెయ్య.. హీరో అవ్వాలనుకుంటే జీరో అయ్యాడు
ఈ కుర్రాడి టాలెంట్ తగలెయ్య.. హీరో అవ్వాలనుకుంటే జీరో అయ్యాడు
Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో కుర్రాళ్లకు స్టంట్లు చేయడం ఒక పిచ్చిగా మారిపోయింది. పది మందిలో హీరో అనిపించుకోవాలని, నాలుగు లైకులు సంపాదించాలని చేసే ప్రయత్నాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. స్టంట్లు చేయాలనుకున్న ఆ కుర్రాడి ప్లాన్ ఎలా అట్టర్ ప్లాప్ అయిందో అర్థమవుతుంది. బైక్ మీద ధూమ్ సినిమా రేంజ్‌లో హంగామా చేయాలనుకున్న సదరు యువకుడు, చివరికి బైక్‌తో సహా నేరుగా వెళ్లి పొలంలో ల్యాండ్ అయ్యాడు. ఈ వింత ప్రమాదాన్ని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుర్రాడు తన బైక్ మీద గ్రామం నుంచి బయలుదేరుతాడు. రోడ్డు మీద వెళ్తూ సడన్‌గా బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వీలీ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే పాపం అతని అంచనా తప్పింది. బైక్ ముందు చక్రం గాల్లోకి లేచిన వెంటనే బ్యాలెన్స్ తప్పి, రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి బైక్ దూసుకెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఆ పొలంలో పంట ఉండటంతో అతనికి పెద్దగా గాయాలు కాలేదు. వెంటనే లేచి తన బైక్ తీసుకుని బయటకు రావడానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న మరికొందరు యువకులు అతనికి సాయం చేయడం వీడియోలో కనిపిస్తుంది.
भाई ने सोचा था Doom मचाएंगे, पर यहाँ तो धूम धड़ाका ही हो गया
— TANVEER (@mdtanveer87) January 25, 2026
खेत में लैंडिंग कैसी लगी?
Road Safety pic.twitter.com/cV6Cg34QNX
ఈ వీడియోను @mdtanveer87 అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. "భాయ్ ధూమ్ మచాద్దాం అనుకున్నాడు.. కానీ ఇక్కడ ధూమ్ ధడకా అయిపోయింది" అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు. "రోడ్ల మీద ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం" అని కొందరు హితవు పలుకుతుంటే, "అది రోడ్డు కాదు నాయనా.. విమానం రన్‌వే కాదు, అలా గాల్లోకి లేపడానికి" అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.
స్టంట్లు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కేవలం కొద్ది సెకన్ల వీడియో కోసం లేదా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పోలీసులు, పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఈ కుర్రాడు అదృష్టవంతుడు కాబట్టి పొలంలో పడి బతికిపోయాడు, అదే రోడ్డు మీద వేరే వాహనం ఏదైనా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకే రోడ్డు మీద జోష్ కంటే హోష్ చాలా ముఖ్యం.