Viral Video: నాన్న తొలి స్పర్శ.. కన్నీటి ఆనందం! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తండ్రి-బిడ్డల ఎమోషనల్ వీడియో..!
Viral Video: తండ్రి ప్రేమకు సాటి ఏముంటుంది? తన ప్రతిరూపాన్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ తండ్రి పొందే అనుభూతి వర్ణనాతీతం.
Viral Video: నాన్న తొలి స్పర్శ.. కన్నీటి ఆనందం! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తండ్రి-బిడ్డల ఎమోషనల్ వీడియో..!
Viral Video: తండ్రి ప్రేమకు సాటి ఏముంటుంది? తన ప్రతిరూపాన్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ తండ్రి పొందే అనుభూతి వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి ఒక అపురూప క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చెన్నైకి చెందిన ఓ వైద్యురాలు షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది.
కంగారు.. భయం.. ఆపై పట్టరాని ఆనందం!
వైద్యురాలు లేబర్ రూమ్ నుంచి అప్పుడే పుట్టిన పసికందును తీసుకువచ్చి, బయట వేచి ఉన్న తండ్రికి చూపించారు. "ఇదిగో మీ బిడ్డ.. తీసుకోండి" అని డాక్టర్ బిడ్డను ఇస్తుండగా, ఆ తండ్రి ఒక్కసారిగా కంగారుపడ్డాడు. పసికందును ఎలా ఎత్తుకోవాలో తెలియక, ఎక్కడ బిడ్డకు ఇబ్బంది కలుగుతుందోనన్న భయంతో అతను వెనకడుగు వేశాడు.
వైద్యురాలు అతడికి ధైర్యం చెప్పి, జాగ్రత్తగా ఎలా పట్టుకోవాలో వివరిస్తూ బిడ్డను చేతుల్లో పెట్టారు. తన బిడ్డను మొదటిసారి హత్తుకోగానే ఆ తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఆనందం, ఆ భయం, ఆ ప్రేమ కలగలిసిన భావోద్వేగం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
20 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
తండ్రి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో ఏకంగా 20 కోట్ల (200 Million) వీక్షణలను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక కొత్త ప్రయాణం మొదలైనప్పుడు తండ్రి పడే తపనను ఈ వీడియో అద్దం పడుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.