Viral Video : అంతరిక్ష శాస్త్రవేత్తలకే అందని ఐడియా.. సైకిల్ తొక్కితే చాలు ఈ కారు పరుగెడుతుంది
Viral Video : పెట్రోల్ అవసరం లేకుండా సైకిల్ తొక్కడం ద్వారా కారును నడిపించే వినూత్న జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి క్రియేటివిటీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Cycle Car
Viral Video : ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు కారు తీయాలంటేనే జంకుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి కనిపెట్టిన సైకిల్ కారు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పెట్రోల్ అవసరం లేకుండా, కేవలం సైకిల్ తొక్కితే కారు ముందుకు కదిలేలా ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నింజా టెక్నిక్ చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక పాత కారు బోనెట్ పైన ఒక సైకిల్‌ను అమర్చారు. ఆ సైకిల్ చైన్ మెకానిజాన్ని కారు చక్రాలకు అనుసంధానించినట్లు కనిపిస్తోంది. ఒక వ్యక్తి కారు ముందు కూర్చుని సైకిల్ తొక్కుతుంటే, ఆ శక్తితో కారు నెమ్మదిగా రోడ్డుపై ముందుకు సాగుతోంది. దీనికి ఎటువంటి ఇంధనం అవసరం లేదు, కేవలం మనిషి కండరాల బలం ఉంటే చాలు. అటు వ్యాయామానికి వ్యాయామం, ఇటు కారు ప్రయాణం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం.
Un-inventing a car
— Science girl (@sciencegirl) March 12, 2026
pic.twitter.com/zx2ZDKPgD1
ఈ వింత కారును చూసి జనం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్)లో @sciencegirl అనే హ్యాండిల్‌తో షేర్ చేసిన ఈ 13 సెకన్ల వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. ఇది కారా లేక సైకిలా? అని కొందరు తలలు గోక్కుంటుంటే, మరికొందరు మాత్రం ఆ వ్యక్తిని జీనియస్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. భారతీయుల మెదడులో ఉండే ఇలాంటి వింత ప్రయోగ ఐడియాల ముందు ఎంతటి ఇంజనీర్లయినా తలవంచాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఇది రోడ్డుపై వేగంగా వెళ్లడానికి పనికిరాకపోయినా, ఒక వినూత్న ఆలోచనగా మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఇంధన ధరలు పెరిగితే మధ్యతరగతి మనిషి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడని చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఈ సైకిల్-కారు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.