The Hunter: అడవిలో కొత్త హెచ్‌డీ వేటగాడు: ‘ది హంటర్’ స్నైపర్ డాగ్ సంచలనం

కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఓ సరికొత్త ఆయుధం అడవిదొంగలకు చెక్ పెడుతున్న ది హంటర్ మిస్టరీ కేసుల్ని అవలీలగా చేధిస్తున్న స్నైపర్ డాగ్

Update: 2025-11-24 12:18 GMT

The Hunter: అడవిలో కొత్త హెచ్‌డీ వేటగాడు: ‘ది హంటర్’ స్నైపర్ డాగ్ సంచలనం

అడవుల్లో ఈ మధ్య అడవి దొంగలు ఎక్కువయ్యారు. పుష్ప సినిమాలో చూపించిన విధంగా అడవుల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి.. ఇలాంటి పుష్పల ఆటకట్టించేందుకు అటవీ శాఖ అధికారులు కూడా కొత్త పద్ధతులు ఎన్నుకుంటున్నారు.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఇప్పుడు కొత్త ‘ఆయుధం’ రంగంలోకి దిగింది. ఆయుధం పేరు హంటర్. ఓ స్నైపర్ డాగ్….ఇప్పుడు ఈ హంటర్ పేరు చెప్పగానే వేటగాళ్లు, కలప దొంగలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి.. ఇంతకీ ఈ స్నాపర్ డాగ్ చేసిన అద్భుతాలు చూస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. మిస్టరీ లాంటి 3 కేసులను .. కేవలం 10 రోజుల్లోనే ఛేదించి... అటవీ శాఖ అధికారులకు ఊరట కలిగించింది.


మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి డివిజన్లలో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో నాణ్యమైన టేకు కలప, వివిధ రకాల వన్యప్రాణులు పుష్కలంగా ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా కలప అక్రమ రవాణా, వేట కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు హర్యానాలోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఒక స్నైపర్ డాగ్‌ను ఈ నెల రంగంలోకి దింపారు. ఇదిగో ఇదే ఆ హైలీ టాలెంటెడ్ డాగ్ …

దీని పేరు హంటర్. 7 నెలల కఠిన శిక్షణ అనంతరం దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో హంటర్ మూడో ర్యాంకు సాధించింది.


వన్యప్రాణులను చంపిన వ్యక్తులను వాసన ఆధారంగా గుర్తించడం, అక్రమంగా నరికిన టేకు కలప దాగిన చోటును పసిగట్టడం, అడవిలో పెట్టిన ఉచ్చులను కనుగొనడం, వన్యప్రాణుల అక్రమ రవాణాను ఆపడం. ఇదీ హంటర్ స్పెషాలిటీ … విధుల్లో చేరిన 10 రోజుల వ్యవధిలోనే మూడు కేసులు ఛేదించింది హంటర్ … పేరుకు తగ్గట్టే వేటగాలన్నీ వెంటాడుతూ హడలెత్తిస్తోంది..


ఈ డైనమిక్ హంటర్.. ఒక కేసులో టేకు కలప దొంగను గుర్తించి పట్టించగా… మరో రెండు కేసుల్లో వన్యప్రాణులను వేటాడి, మాంసం తిని ఎముకలను ఇంటి వెనక పడేసిన వ్యక్తులను వాసన ఆధారంగా గుర్తించి అరెస్టుకు దారి తీసింది. దీంతో అటవీ శాఖ అధికారులు హంటర్‌ను మరింత ఎక్కువ ప్రాంతాల్లో ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అడవులను, వన్యప్రాణులను కాపాడేందుకు ఇకపై హంటర్ అనే ఈ నాలుగు కాళ్ల సైనికుడు అటవీ శాఖకు అండగా నిలుస్తున్నాడు…


ఇటీవల ఓ కేసులో హంటర్ నిందితులని పట్టుకున్న తీరు అటవీశాఖ అధికారులని నివ్వెరపోయేలా చేసింది…అందుకే హంటర్ ఇప్పుడు అటవీశాఖ లో ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఈ హంటర్ ఎందరో పుష్ప లాంటి అడవి దొంగలకు చెక్ చెబుతోంది.. 

Tags:    

Similar News