Viral News: వామ్మో..! కొడుకు రైల్వే ఉద్యోగం కోసం ఇంటినే రైలు ఇంజిన్‌లా మార్చేసిన తండ్రి
Viral News: కొడుకు రైల్వే ఉద్యోగం సాధించడంతో రాజస్థాన్‌కు చెందిన ఓ తండ్రి తన ఇంటినే రైలు ఇంజిన్‌లా రంగవేసి వినూత్నంగా ఆనందం పంచుకున్నాడు.
Viral News: వామ్మో..! కొడుకు రైల్వే ఉద్యోగం కోసం ఇంటినే రైలు ఇంజిన్‌లా మార్చేసిన తండ్రి
Viral News: కొడుకు సాధించిన విజయానికి తండ్రి ఇచ్చిన వినూత్న గౌరవం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో నివసించే ఓ తండ్రి, తన కుమారుడు రైల్వే ఉద్యోగం సాధించిన ఆనందంలో ఇంటినే రైలు ఇంజిన్‌లా మార్చేశాడు. ఈ ఇంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
గ్రామంలో సాధారణంగా కనిపించే ఒక ఇంటి వద్దకు దగ్గరగా వెళ్లినప్పుడు, అది అచ్చం భారతీయ రైల్వే కోచ్‌ను తలపించేలా కనిపిస్తోంది. నీలం, తెలుపు, పసుపు రంగుల్లో ఇంటిని రంగవేసి, రైలు ఇంజిన్ ముందుభాగంలా డిజైన్ చేశారు. కింద భాగంలో చక్రాల్లా కనిపించేలా నలుపు రంగులో చిత్రాలు వేశారు. ఇంటి పైభాగంలో రైలు గుర్తింపు నంబర్‌లా ఒక సంఖ్యను కూడా చిత్రించారు.
ఇంటి పక్కభాగంలో వరుసగా కిటికీలు, పసుపు రంగు నిలువు గీతలతో హ్యాండ్రైల్స్‌ను పోలిన ఆకృతులు వేశారు. ఇంటి తలుపు కూడా రైలు కోచ్‌లా నీలం రంగులో ఉండడం విశేషం. వెనుక భాగంలో ఎమర్జెన్సీ మార్కింగ్‌లను గుర్తు చేసేలా ఎరుపు వలయాలను చిత్రించారు. మొత్తం చూసుకుంటే, ఆ ఇల్లు గ్రామీణ ప్రాంతంలో నిలిపిన రైలులా కనిపిస్తోంది.
ఈ వీడియోలో తండ్రి లేదా కుమారుడు కనిపించకపోయినా, కొడుకు రైల్వే ఉద్యోగం సాధించిన ఆనందాన్ని ఇలా ప్రత్యేకంగా జరుపుకున్నట్లు వీడియోలోని క్యాప్షన్ తెలియజేస్తోంది. ఫిబ్రవరి 3న సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు కోట్లాది వ్యూస్ వచ్చాయి.
నెటిజన్లు ఈ వీడియోపై భావోద్వేగంతో పాటు సరదా కామెంట్లు చేస్తున్నారు. “ఇదే తండ్రి ప్రేమ అంటే”, “కొడుకు ఉద్యోగం రైలులో, ఇల్లు కూడా రైలులోనే” అంటూ ప్రశంసలతో పాటు హాస్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కొడుకు విజయాన్ని ఇలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిన తండ్రి చర్య ఇప్పుడు అందరి మనసులను దోచుకుంటోంది.