Viral Video : వీడు డాక్టరా లేక మెకానికా? కటింగ్ ప్లేయర్‎తో పన్ను పీకడం చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

Viral Video : కటింగ్ ప్లేయర్తో మహిళ పన్ను పీకుతున్న భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనస్థీషియా లేకుండా చేస్తున్న ఈ దంత వైద్యం చూసి నెటిజన్లు హడలిపోతున్నారు.

Update: 2026-03-21 04:09 GMT

Dentistry

Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో వింతలు, విశేషాలు మన కళ్లముందుకు వస్తుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా, వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. దంతవైద్యం అంటేనే భయపడే వారికి, ఈ వీడియో చూశాక అసలు జీవితంలో డెంటిస్ట్ దగ్గరకు వెళ్లకూడదు అనే రేంజ్‌లో భయం పుడుతోంది. అనస్థీషియా లేదు, సరైన మెడికల్ పరికరాలు లేవు.. కేవలం ఒక కటింగ్ ప్లేయర్ ‎తో మహిళ పన్ను పీకుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా దంత సమస్య వచ్చి పన్ను పీకాల్సి వస్తే.. డెంటిస్టులు ముందుగా ఆ ప్రాంతం మొద్దుబారడానికి అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. కానీ, drshuklaklinic అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా వేరుగా ఉంది. ఒక మహిళ కుర్చీలో కూర్చుని ఉండగా, ఆమె ముందు కూర్చున్న వ్యక్తి చేతిలో మెకానిక్ షాపుల్లో వాడే కటింగ్ ప్లేయర్ పట్టుకుని ఉన్నాడు. దాంతో ఆమె నోట్లోని పన్నును పట్టుకుని బలంగా లాగుతున్నాడు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధ వర్ణనాతీతం. పన్ను ఊడి రాకపోవడంతో అతను కటింగ్ ప్లేయర్తో అటూ ఇటూ తిప్పుతూ బలంగా లాగడం చూస్తుంటే నెటిజన్ల ఒళ్లు గగుర్పొడుస్తోంది.

అనస్థీషియా లేకపోవడమే అతిపెద్ద షాక్

ఈ వీడియోలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఆ మహిళకు ఎటువంటి అనస్తీషియా ఇవ్వకపోవడం. ఆ వ్యక్తి కటింగ్ ప్లేయర్తో పన్నును లాగుతున్న ప్రతిసారీ ఆమె నొప్పిని భరించలేక ముఖాన్ని తిప్పుకోవడం, అల్లాడిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన ఎవరైనా సరే.. ఇతను ప్రొఫెషనల్ డాక్టర్ కాదు అని ఇట్టే చెప్పేయగలరు. చదువుకున్న వారు కూడా ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులను అనుసరించడం ఏంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల ఆందోళన

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇది చూస్తుంటేనే నాకు పన్ను నొప్పి వస్తోంది", "డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాలన్నా ఇప్పుడు భయం వేస్తోంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి దంతవైద్యం అనేది చాలా సున్నితమైన ప్రక్రియ. సరైన పరికరాలు లేకపోతే నోటిలో ఇన్ఫెక్షన్లు రావడం, చిగుళ్లు దెబ్బతినడం, తీవ్రమైన రక్తస్రావం వంటి ప్రాణాపాయ స్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి వీడియోలను చూసి ఇంట్లో ప్రయత్నించడం గానీ, నకిలీ డాక్టర్ల దగ్గరకు వెళ్లడం గానీ చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తగా ఉండండి.. నిపుణులనే సంప్రదించండి

దంత క్షయం లేదా పన్ను నొప్పి ఉన్నప్పుడు కేవలం క్వాలిఫైడ్ డెంటిస్ట్‌ను మాత్రమే సంప్రదించాలి. సరైన టెక్నిక్ లేకుండా ప్లాస్ వంటి మొరటు పరికరాలతో పన్ను పీకడం వల్ల దవడ ఎముక కూడా విరిగే ప్రమాదం ఉంది. ఈ వైరల్ వీడియోలో ఉన్న మహిళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు కానీ, చూసే వారికి మాత్రం ఇది ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నారా లేక నిజంగానే అక్కడ వైద్యం ఇలా జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News