Viral Video: ఈ పాము చాలా లక్కీ.. ముంగిస బారి నుంచి ఎలా బయటపడిందో చూడండి

Viral Video: పాము-ముంగిస పోరాటం అంటే సాధారణంగా పాము ఓడిపోవడం ఖాయం.

Update: 2025-10-24 12:30 GMT

 Viral Video: ఈ పాము చాలా లక్కీ.. ముంగిస బారి నుంచి ఎలా బయటపడిందో చూడండి

Viral Video: పాము-ముంగిస పోరాటం అంటే సాధారణంగా పాము ఓడిపోవడం ఖాయం. అత్యంత విషపూరితమైన నాగుపాము (Cobra) సైతం ముంగిస అంటే భయపడుతుంది. ఈ రెండు జీవుల ఫైటింగ్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో జరిగిన ఒక ఘటన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ మనుషులు జోక్యం చేసుకోవడంతో నాగుపాము ప్రాణాలను దక్కించుకుంది.

పడగ విప్పిన పామును చూసి...

రాజస్థాన్‌లోని పిపాల్ఖుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై ఈ దృశ్యం కనిపించింది. d.charpota.51 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం, వాహనాలు రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో ఒక నాగుపాము పడగ విప్పి కూర్చుంది. ఇది చూసిన ప్రయాణికులు వెంటనే తమ వాహనాలను నిలిపివేశారు. కొందరు భయంతో, మరికొందరు ఆసక్తితో దృశ్యాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు.

అదే సమయంలో, రోడ్డు పక్కన ఉన్న పొదల్లోంచి ఓ భారీ ముంగిస బయటకు వచ్చి పాము వైపు దూసుకొచ్చింది. తన సహజ శత్రువుతో పోరాటానికి అది సిద్ధమైంది. అయితే, అక్కడ గుమిగూడిన ప్రజలు ఒక్కసారిగా గట్టిగా అరవడంతో, ఆ శబ్దానికి భయపడిన ముంగిస పోరాటం చేయకుండానే వెనక్కి తిరిగి పొదల్లోకి పారిపోయింది.

కోట్ల మంది వీక్షించిన వైరల్ వీడియో

మానవ జోక్యంతో ఆ నాగుపాము ముంగిస బారి నుంచి తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ మొత్తం దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే కోట్లాది మంది ఈ వీడియోను వీక్షించారు.

3 లక్షలకు పైగా లైక్‌లు పొందిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రమాదంలో ఉన్న పామును కాపాడి, అక్కడి గ్రామస్తులు మానవత్వాన్ని ప్రదర్శించారని చాలా మంది కామెంట్లు చేశారు.


Tags:    

Similar News