ZyCoV-D Vaccine: త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా.. అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు!

ZyCoV-D Vaccine: దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

Update: 2021-06-15 09:45 GMT

జైకోవ్‌-డీ వ్యాక్సిన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

ZyCoV-D Vaccine: దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్‌గానూ నిలువనుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్ వ్యాక్సిన్‌ 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా.. మరొకటి స్వదేశీ టీకా. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వీ టీకాలు రెండు డోసులు కాగా జైకోవ్ డి వ్యాక్సిన్‌కు మూడు డోసులుంటాయి. తొలి డోసు వేసుకున్న నెల రోజులకు రెండవ డోసు, తరువాత మరో నెల రోజులకు మూడవ డోసు తీసుకోవల్సి ఉంటుంది. డీసీజీఐ అనుమతి లభిస్తే..తొలి చిన్నారుల వ్యాక్సిన్ కానుంది.

Tags:    

Similar News