Agastya Chauhan: రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ అగస్త్య దుర్మరణం
Agastya Chauhan: ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన అగస్త్య
Agastya Chauhan: రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ అగస్త్య దుర్మరణం
Agastya Chauhan: వేగం కన్నా ప్రాణం మిన్న.. అంటూ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొంత మందిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. సరదా కోసం, యూ ట్యూబ్‌లో వ్యూస్ కోసం..అతి వేగంగా బైక్ నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో.. యూ ట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహన్ ఇదే తరహా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యమునా ఎక్స్ ప్రెస్ హైవే పై.. గంటకు 270 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న అగస్త్య బైక్..అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య చౌహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య ఢిల్లీలో జరిగే మోటార్ బైక్ రేసింగ్ పోటీ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రొ రైడర్ 1000 పేరుతో అగస్త్య ఓ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. దానికి 1.2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రమాదానికి 16 గంటల ముందు యూట్యూబ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఢిల్లీకి రావాలని తన స్నేహితులను అందులో కోరాడు అగస్త్య.