అక్కడ రానున్న 24 గంటల్లో ఉరుములు,మెరుపులతో వర్షాలు

Update: 2020-05-30 15:50 GMT

బీహార్‌ రాజధాని పాట్నాలో శనివారం సాయంత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాయంత్రం ఏడు గంటలకు బలమైన ఈదురుగాలుల తోపాటు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఇక రానున్న 25 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పాట్నా, కటిహార్, భాగల్పూర్, బంకా, ముంగేర్, ఖగారియా, గయా, నలంద, బెగుసారై, పూర్నియా, సుపాల్ సహా 25 జిల్లాలు 24 నుంచి 48 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో వాతావరణ శాఖ మే 31 ఉంచి జూన్ 1వరకూ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వర్షం లేని ప్రదేశాలలో, ఆకాశం మేఘావృతమవుతుంది.

దీనివల్ల పగటిపూట తేమతో కూడిన వేసవి ఉంటుంది. ఉదయం , సాయంత్రం బలమైన గాలి కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కాగా పాట్నాలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 36.4 డిగ్రీలు, కనిష్టంగా 27.2 డిగ్రీలు నమోదైంది. ఈశాన్య బీహార్‌లోని తూర్పు-పశ్చిమ చంపారన్, సరన్, సివాన్, గోపాల్‌గంజ్ మరియు సీతామార్హి, మధుబని, ముజఫర్‌పూర్, దర్భాంగా, వైశాలి, సమస్తిపూర్, సుపాల్, అరేరియాలో మే 31 తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News