Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..!
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..!
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో అసోం రాడిసన్ హోటల్లో మకాం వేసిన 42 మంది రెబల్స్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు ఆ క్యాంప్ నుంచి బయటకొస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్ గూటి నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షిండే బలం గంట గంటకు తగ్గిపోతోంది.
ఇదిలా ఉంటే మరోవైపు మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఎన్సీపి అధినేత శరద్ పవార్ తాజాగా ప్రకటించారు. అసోంలో బలప్రదర్శన చేయడం కాదని ముంబైకి వచ్చి బలాన్ని ప్రదర్శించాలని సూచించారు. అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో తన నిజమైన బలాన్ని చూపించాలని షిండేకు సవాల్ విసిరారు శరద్ పవార్. మరోవైపు తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ కోశ్యారీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి అన్ని వివరాలతో కూడిన లేఖ రాస్తానని సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పినట్లు తెలుస్తోంది.