Narendra Modi: సాంకేతిక ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వాలు అవసరం

Narendra Modi: ఉగ్రవాదం, ఆరోగ్యం, ఇంధనం, నీరు, ఆహార భద్రత సవాళ్లుగా మారాయి

Update: 2024-02-14 13:44 GMT

Narendra Modi: సాంకేతిక ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వాలు అవసరం

Narendra Modi: ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ గవర్నమెంట్ సమ్మిట్‌-2024లో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లుగా మినిమమ్‌ గవర్నమెంట్‌, మాగ్జిమమ్‌ గవర్నెన్స్‌నినాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. UAE దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్‌ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు.

ఆధునికతవైపు దూసుకుపోతున్న ప్రపంచానికి దశాబ్దాలుగా ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఇంధనం, నీరు, ఆహార భద్రత రూపంలో అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. మరోవైపు సాంకేతికత మనిషిని అభివృద్ధివైపు నడిపిస్తూనే.. అంతరాయాలను సృష్టిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.

Tags:    

Similar News