Kartikeya wedding photo: ఎంత చూడ ముచ్చటైన జంట.. మాజీ సీఎం కుమారుడి పెళ్లి ఫొటోలు వైరల్

Update: 2025-03-08 10:25 GMT

Kartikeya wedding photo: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద కుమారుడు కార్తికేయ వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.



కార్తికేయ లిబర్టీ షూ కంపెనీ డైరెక్టర్ అనుపమ్ బన్సాల్ కుమార్తె అమానత్‌ను వివాహమాడారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. 

 


మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి వచ్చిన మాజీ సైనికులు కూడా హాజరయ్యారు. అటు ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు.



కార్తికేయ, అమానత్ వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరిగింది. సంగీత్, మెహందీ, వివాహ ఆచారాలతో సహా మూడు రోజుల పాటు వివాహ వేడుకలు వైభవంగా సాగాయి.

 


గురువారం సాయంత్రం వీరి పెళ్లి ఊరేగింపు జరిగింది.శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన చిన్న కుమారుడు కునాల్ తీన్మార్ డ్యాన్స్ తో అదరగొట్టారు.



 సంగీత కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధన సింగ్ తో కలిసి డ్యాన్స్ చేశారు.

 


సాధన సింగ్ తన ఇద్దరు కోడళ్లతో కలిసి డ్యాన్స్ చేశారు. వధూవరులు కార్తికేయ, అమానత్ జంట అందర్నీ ఆకట్టుకుంది.



ఈ కార్యక్రమానికి దేశం, రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డ్యాన్స్ కూడా చేశారు. కార్తికేయ, అమానత్ జంట పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

 

Tags:    

Similar News