Shivraj Singh Chouhan: మహిళాభ్యున్నతే లక్ష్యం

Shivraj Singh Chouhan: కుటుంబ ఆధారంలేని మహిళలకు జీవనోపాధి

Update: 2022-10-28 02:27 GMT

Shivraj Singh Chouhan: మహిళాభ్యున్నతే లక్ష్యం

Shivraj Singh Chouhan: మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని మధ‌్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సెషోర్‌లో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల జీవనోపాధికి వనరులు చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికోసం ఆత్మవంచనలేకుండా పనిచేస్తామన్నారు. చిరుప్రాయంలోనే వివాహాలు చేసుకున్న మహిళలు జీవిత భాగస్వామ్యులకు దూరమై దుర్భర జీవితాన్ని అనుభవించకుండా... ఎవరికాళ్లపై వారిని నిల్చోబెట్టేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. నెలకు కనీసం పదివేల రూపాయల ఆదాయం సమకూరే విధంగా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు.

Tags:    

Similar News