RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 30 విమానాల రద్దు

RGI Airport: తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్టా విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Update: 2021-05-08 02:28 GMT

Shamshabad Airport:(File Image) 

RGI Airport: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడంతో పాటు, మరణాలు కూడా వందల సంఖ్యలో సంభవిస్తున్నాయి. చాలా మంది సరైన వైద్యం అందక మరణిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్  ఎయిర్ పోర్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 30 విమానాలను అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-పుణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతోనే విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ- ఆంద్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 14 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతో విమానాలను రద్దు చేసినట్లు ఆధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News