Sucide: విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విషం తాగి సామూహిక ఆత్మహత్య..కారులో డెడ్ బాడీలు

Update: 2025-05-27 02:49 GMT

Sucide: విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విషం తాగి సామూహిక ఆత్మహత్య..కారులో డెడ్ బాడీలు

Sucide: హర్యానాలోని పంచకుల నగరంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి బయట రోడ్డుపై ఆపి ఉంచిన కారులో ఏడుగురు మృతదేహాలు కారులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్ డోర్లు ఓపెన్ చేసి డెడ్ బాడీలను బయటకు తీశారు. అప్పులు, ఆర్థిక సంక్షోభం కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

మృతుల్లో డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42), ప్రవీణ్ తల్లిదండ్రులు, ప్రవీణ్ భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలం నుండి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఏం రాసారనేది పోలీసులు వెల్లడించడలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడు మృతదేహాలను పంచకులలోని ప్రైవేట్ ఆసుపత్రుల మార్చురీలో భద్రపరిచారు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న తర్వాత, పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ లా అండ్ ఆర్డర్ అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు కోసం నమూనాలను సేకరించింది. దర్యాప్తు తర్వాతే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News