Ration Card: వారి రేషన్‌కార్డులు రద్దవుతున్నాయి.. మీరు ఆ లిస్ట్‌లో ఉన్నారా..!

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉందా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఇప్పుడు ప్రభుత్వం రేషన్‌కార్డు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

Update: 2022-06-29 07:31 GMT

Ration Card:వారి రేషన్‌కార్డులు రద్దవుతున్నాయి.. మీరు ఆ లిస్ట్‌లో ఉన్నారా..!

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉందా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఇప్పుడు ప్రభుత్వం రేషన్‌కార్డు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారుల రేషన్‌కార్డులు రద్దయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వం అనర్హులు అయి ఉండి రేషన్‌ కార్డు పొందినవారిని గుర్తించే పనిలో పడింది. రేషన్‌లో నకిలీలను అరికట్టేందుకు కార్డు వెరిఫికేషన్‌ జరుగుతోంది.

ఈ క్రమంలో బిహార్‌ రాష్ట్రంలోని గయా జిల్లాలోని షేర్‌ఘటిలో 12 వేలకు పైగా అనుమానాస్పద రేషన్ కార్డులను గుర్తించి రద్దు చేశారు. ఇదొక్కటే కాదు రేషన్ కార్డులను రద్దు చేసే ముందు కార్డుదారులకు నోటీసులు పంపుతోంది. వాస్తవానికి చాలామంది రేషన్‌కార్డు దారులు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోవడం లేదని వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం వారందరికి నోటీసులు జారీ చేసింది.

ఇందులో కొన్ని ఫేక్‌ రేషన్‌కార్డుదారులు ఉన్నట్లు గుర్తించింది. వారి రేషన్‌కార్డులని రద్దు చేసింది. రేషన్‌కార్డు ఉండి రేషన్‌ తీసుకోపోతే కార్డు రద్దవుతుంది. వ్యవసాయ భూ యజమానులు, ట్రాక్టర్-ట్రక్కు, కారు-బైక్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తుల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే వెంటనే చేయండి. లేదంటే రేషన్‌ కట్‌ అవుతుంది. రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు.

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అందుతుంది. కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారు. రేషన్ కార్డుతో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం వల్ల 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్ పొందవచ్చు.

Tags:    

Similar News