Ration Card: మీకు కొత్తగా పెళ్లయిందా.. రేషన్‌కార్డుని ఇలా అప్‌డేట్‌ చేసుకోండి..!

Ration Card: మీరు ఇటీవల పెళ్లి చేసుకున్నట్లయితే రేషన్‌కార్డులో మార్పులు చేయాల్సి ఉంటుంది.

Update: 2022-05-11 07:28 GMT

Ration Card: మీకు కొత్తగా పెళ్లయిందా.. రేషన్‌కార్డుని ఇలా అప్‌డేట్‌ చేసుకోండి..!

Ration Card: మీరు ఇటీవల పెళ్లి చేసుకున్నట్లయితే రేషన్‌కార్డులో మార్పులు చేయాల్సి ఉంటుంది. మీ భార్య పేరు లేదా పిల్లల పేర్లని రేషన్‌ కార్డులో యాడ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి సంబంధించిన కోటా తీసుకోలేరు. రేషన్‌కార్డులో కొత్త సభ్యుల పేర్లని చేర్చే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మీరు వివాహం చేసుకున్నట్లయితే ముందుగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం భార్య ఆధార్ కార్డులో భర్త పేరు నమోదు చేయాలి. అలాగే పిల్లల పేర్లని యాడ్‌ చేయడానికి తండ్రి పేరు కచ్చితంగా అవసరమవుతుంది. దీంతో పాటు చిరునామా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసిన తర్వాత సవరించిన ఆధార్ కార్డు కాపీతో రేషన్‌ కార్డుకు పేరును యాడ్‌ చేయాలని ఆహార శాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

పైన పేర్కొన్న ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. లేదా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీని కోసం, ముందుగా మీ రాష్ట్ర ఆహార సరఫరా విభాగం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీ రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో సభ్యుల పేర్లను యాడ్‌ చేసే సదుపాయం ఉంటే మీపని సులువుగా అయిపోతుంది. అయితే చాలా రాష్ట్రాలు తమ పోర్టల్‌లో ఈ సదుపాయాన్ని కల్పించాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం కల్పించలేదు. ఇలాంటి వారు ఆహార శాఖ అధికారికి అప్లై చేసుకోవాలి.

మీరు రేషన్‌కార్డులో పిల్లల పేరును యాడ్‌ చేయాలనుకుంటే ముందుగా మీరు పిల్లవాడి ఆధార్ కార్డును తయారు చేయాలి. దీని కోసం మీకు పిల్లల జనన ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. తరువాత మీరు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డులో పిల్లల పేరు నమోదు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

Tags:    

Similar News