Rahul Gandhi: మణిపూర్‌ పర్యటనకు రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: రెండు రోజుల పాటు మణిపూర్‌లో రాహుల్ పర్యటన

Update: 2023-06-29 04:40 GMT

Rahul Gandhi: మణిపూర్‌ పర్యటనకు రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్‌ కాసేపట్లో ఇంఫాల్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో బాధితులతో పాటు రిలీఫ్‌ క్యాంప్‌లను పరిశీలిస్తారు. అక్కడి పౌర సమాజ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇంఫాల్ చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడ నుంచి చురాచంద్‌పూర్‌కు వెళ్తారు. అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న స్థానికులను పరామర్శిస్తారు.

చురాచంద్‌పూర్ నుంచి మోయిరాంగ్‌ ప్రాంతంలో బాధితులను పరామర్శించి.. పౌర సమాజ ప్రతినిధులతో సమావేశం అవుతారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. మేలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకు వంద మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. ఉద్రిక్తతలు పెరగడంతో దాదాపు 50 వేల మందిని 3 వందల పునరావాస కేంద్రాలకు తరలించారు.

Tags:    

Similar News