Narendra Modi: కోటి ఇళ్లపై సౌర ఫలకాలు.. ప్రధాని మోడీ కొత్త కానుక..
Narendra Modi: అయోధ్య నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే మోడీ ప్రకటన
Narendra Modi: కోటి ఇళ్లపై సౌర ఫలకాలు.. ప్రధాని మోడీ కొత్త కానుక..
Narendra Modi: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు.. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో వెల్లడించారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తిలో దేశాన్ని స్వావలంబన దిశగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ పథకానికి సూర్యవంశానికి చెందిన రాముడే స్ఫూర్తి అని ప్రకటించారు. రాముడు ఒక శక్తి అని, ఆయన ప్రతి ప్రశ్నకు జవాబు అని, ఆయన ప్రతి ఒక్కరి దేవుడని మోడీ తెలిపారు. సూర్యవంశానికి చెందినరాముడి నుంచి ఆయన్ను పూజించే భక్తులకు శక్తి లభిస్తుందన్నారు.