PM Narendra Modi: భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
PM Narendra Modi: దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్‌ను ప్రధాని మోడీ సందర్శించారు.
PM Narendra Modi: భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
PM Narendra Modi: దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. ఎలాంటి బందోబస్తు లేకుండా గురుద్వారాకు వెళ్లి, ప్రార్థనలు చేశారు. గురుతేగ్ బహదూర్ 500వ జయంతి సందర్భంగా ప్రకాశ్ పురాబ్ గురుద్వారాలో ప్రార్థనాలు చేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా గురుతేగ్ బహదూర్‌కు నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను ప్రధాని స్మరించుకున్నారు. అణగారిన వర్గాలకు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవింపబడ్డారని, ఆయన చేసిన అత్యున్నత త్యాగం చాలా మందికి బలాన్ని, ప్రేరణ ఇస్తుందని ట్వీట్ చేశారు. సిక్కు మతస్తుల 9వ గురువు తేజ్ బహదూర్ 500వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. గురు తేజ్ బహదూర్ స్మారకాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.