PM Kisan: అన్నదాతలు అలర్ట్.. పదకొండో విడతకి ముందు రెండు పెద్ద మార్పులు..

PM Kisan: అన్నదాతలు అలర్ట్.. పదకొండో విడతకి ముందు రెండు పెద్ద మార్పులు..

Update: 2022-02-23 05:00 GMT

PM Kisan: అన్నదాతలు అలర్ట్.. పదకొండో విడతకి ముందు రెండు పెద్ద మార్పులు..

PM Kisan: దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన  ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం ముఖ్య  ఉద్దేశ్యం. దీని ద్వారా రైతులకు వ్యవసాయం చేయడం సులభతరం అవుతుంది. పీఎం కిసాన్  యోజన కింద రైతుల ఖాతాలకు ఏటా రూ.6000 పంపిస్తారు. మీరు కూడా PM కిసాన్  యోజనలో పేరు నమోదు చేసుకున్నట్లయితే 11వ విడత కోసం వేచి ఉండాలి. కానీ కేంద్ర  ప్రభుత్వం 2 పెద్ద మార్పులు చేసింది. వీటిని 11వ విడత రాకముందే తెలుసుకోవడం ముఖ్యం.

పీఎం కిసాన్ యోజనలో మొదటి అప్‌డేట్‌

ఎవరైనా ఇంతకుముందు PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా వారి ఇన్‌స్టాల్‌మెంట్ స్టేట్‌మెంట్‌ చూడవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో మార్పు చేశారు. ఇప్పుడు మీ స్టేట్‌మెంట్‌ చూడాలంటే మొదట మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు స్టేట్‌మెంట్‌ని చూడగలరు. దీంతో పాటు మరింత సమాచారాన్ని పొందుతారు.

పీఎం కిసాన్ యోజనలో రెండో అప్‌డేట్‌

రెండో మార్పు ఏంటంటే ఇప్పుడు PM కిసాన్ యోజన లబ్ధిదారులు e-KYC చేయాల్సిన అవసరం తప్పనిసరి. e-KYC చేయని వారి ఖాతాలో 11వ విడత డబ్బులు జమకావు. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా KYC చేసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం 11వ విడత పీఎం కిసాన్ యోజనను హోలీ తర్వాత రైతుల ఖాతాలో జమచేసే అవకాశాలు ఉన్నాయి.  

Tags:    

Similar News