PM Kisan: ఏప్రిల్‌లో పీఎం కిసాన్ 11వ విడత.. కానీ వారికి మాత్రమే..!

PM Kisan: మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారు అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Update: 2022-03-05 05:17 GMT

PM Kisan: ఏప్రిల్‌లో పీఎం కిసాన్ 11వ విడత.. కానీ వారికి మాత్రమే..!

PM Kisan: మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారు అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీడియా నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 11వ విడత ఏప్రిల్‌లో విడుదల కానుంది. అయితే అంతకు మందే రైతులు ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 11వ విడతకు సంబంధించి అనేక కొత్త నిబంధనలతో రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మోదీ ప్రభుత్వం ఏటా రూ. 6,000 నేరుగా దేశంలోని రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సొమ్మును ప్రభుత్వం మూడు విడతలుగా రైతులకు విడుదల చేస్తుంది. ఒక్కో విడతలో రైతులకు రూ.2వేలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం10 విడతలు రైతుల ఖాతాలకు చేరాయి. ఇప్పుడు 11వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌లో 11వ విడత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

E-KYC అవసరం

ఆధార్ ఆధారిత OTP ప్రమాణీకరణ కోసం రైతులు కిసాన్ కార్నర్‌లోని e-KYC ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుందని PM కిసాన్ పోర్టల్‌లో సూచించారు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించాలి. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కూడా ఈ పని చేయవచ్చు.

ఈ-కెవైసి ఎలా చేయాలి..?

1. దీని కోసం, మీరు ముందుగా https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

2. కుడి వైపున మీరు దీనికి సంబంధించిన ట్యాబ్‌లను చూస్తారు. e-KYC ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కూర్చొని పూర్తి చేయవచ్చు.

4. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సమీపంలోని CSC కేంద్రాలను సందర్శించాలి.

Tags:    

Similar News