Pegasus: కర్నాటక సంకీర్ణం అందుకే కూలిందా?

Pegasus: పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది.

Update: 2021-07-21 08:55 GMT

కుమారస్వామి(ఫైల్ ఇమేజ్ )

Pegasus: పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. విపక్ష ప్రముఖులతోపాటు పలువురు కేంద్ర మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. ఏడాదిన్నర కిందట కర్నాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి పెగాసస్ స్పైవేర్‌కు సంబంధముందనే ఆరోపణలు వస్తున్నాయి. 2019లో ఆనాటి కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు పెగాసస్ స్పైవేర్‌ని బీజేపీ ఉపయోగించిందంటూ ఏఐసీసీ సంచలన కామెంట్స్ చేసింది.

పెగాసస్‌ డేటా బేస్‌లో అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫోన్ నెంబర్లు ఉండటంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించుకునే ఆనాటి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేశారని ఆరోపిస్తున్నారు. పెగాసస్‌ను వినియోగించుకుని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని మండిపతున్నారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News