Odisha Track Renovation: కొనసాగుతున్న ట్రాక్ పునరుద్దరణ పనులు..
Odisha Track Renovation: 51 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన రైల్వే అధికారులు, సిబ్బంది.
Odisha Track Renovation: కొనసాగుతున్న ట్రాక్ పునరుద్దరణ పనులు..
Odisha Track Renovation: ఒడిశా బాలాసోర్ దగ్గర జరిగిన రైలుప్రమాదం.. దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ భయానక ఘటనలో.. దాదాపు 275 మంది మృత్యువాత పడ్డారు. అలాంటి ప్రమాదం జరిగిన చోట.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే అంత ఈజీ కాదు. కానీ, ఇండియన్ రైల్వే.. దాన్ని నిజం చేసి చూపించింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ చేసింది. పునరుద్ధరణ పూర్తయిన ఫస్ట్ లైన్ మీద.. తొలుత గూడ్స్ రైలు నడిచింది. మరికొన్ని రైళ్ళు కూడా నడవనున్నాయి.