Guillain-Barré Syndrome: బీజీ సిండ్రోమ్ వ్యాధికి అవే కారణం.. తేల్చిన అధికారులు
Guillain-Barré Syndrome: మహారాష్ట్రలోని పుణెలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవ్వడానికి కలుషిత నీరు, ఆహారం కారణమని తేలింది.
Guillain-Barré Syndrome
Guillain-Barré Syndrome
Guillain-Barré Syndrome: మహారాష్ట్రలోని పుణెలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవ్వడానికి కలుషిత నీరు, ఆహారం కారణమని తేలింది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో..ముఖ్యంగా ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డారు. అక్కడ 208 మందిలో అనుమానిత లక్షణాలు కనిపించగా..వైద్య పరీక్షల్లో 181 కేసులు బయట పడ్డాయి. వీరిలో 47 మంది ఆసుపత్రుల్లో చేరారు.
28 మంది ఐసీయూల్లో, 16 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారి నుంచి సేకరించిన నమూనాల్లో డయేరియాకు కారణమయ్యే కంపైలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా, నాన్ పోలియో ఎంటెరో, నోరో వైరస్ లను గుర్తించారు. పుణెలో జీబీఎస్ కేసులు అధికంగా నమోదు అవ్వడానికి దారితీసిన కారణాలను అక్కడి వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందాం. అక్కడి బాధితులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యాధి బారినపడినట్లు గుర్తించారు.
కంపైలో బ్యాక్టర్ బెజునీ బ్యాక్టీరియా ప్రభావానికి గురైనప్పుడు డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు బయటపడ్డాయి. దానికి బాధితుల ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతిస్పందించే క్రమంలో తలెత్తిన సమస్యలే జీబీఎస్ వచ్చేందుకు దోహదం చేశాయి. సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు ఇమ్యూనిటీ ఉత్తేజితమై వాటిని ఎదుర్కొవడానికి యాంటబాడీలను ఉత్పత్తి చేస్తుంది.
కొన్ని కేసుల్లో బాధితుల కణజాలాన్నే శత్రువువగా భావించి ఎదురుదాడి చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు తలెత్తుతాయి. ఈ పరిస్థితులే గులియన్ బారీ సిండ్రోమ్ వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. జన్యుపరమైన కారణాలతో కూడా కొందరు దీని బారిన పడే అవకాశం కూడా ఉంది. అత్యంత అరుదుగా వ్యాక్సినేషన్లు, శస్త్రచికిత్సలు, గాయాల వల్ల కూడా ఈ తరహాకేసులు నమోదు అవుతాయి. బాధితుల ఆరోగ్య స్థితికి అనుగుణంగా వారి శరీర బరువుకు తగ్గట్లు 2 గ్రాముల చొప్పున ఇమ్యూనూ గ్లోబ్యులిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు.