Officials Launch Raids on Schools : ప్రయివేట్ స్కూళ్ల ఫీజులుం పై అధికారుల కొరడా !

Update: 2020-07-17 08:22 GMT

Officials Launch Raids on Schools : ఏటా జూన్‌ వస్తుందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్న పరిస్థితి. ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు వసూలు చేసే ఫీజులు, పుస్తకాలు, మెటీరియల్‌ పేరుతో సాగుతున్న వసూళ్ల దందా అంతా ఇంతాకాదు. లాక్‌డౌన్‌ బందీలో చిక్కుకొని అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు పనిచేయకున్నా యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు.

ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు కళ్లెం వేసేందుకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్స్‌ తెరుచుకోవడం లేదు. విద్యార్దులందరూ ఇండ్ల కే పరిమితమైయ్యారు. అయితే కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విద్యాధికారులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఫీజులు కట్టమని ఫోన్‌ చేసిన మెసేజ్‌ పంపినా తమకు ఫిర్యాదు చేయాలని విద్యాశాఖ అదికారులు సూచిస్తున్నారు.

ప్రైవేటు స్కూళ్లు, కార్పోరేట్ స్కూళ్ల లో విద్యార్దుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు నియంత్రించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిదులు హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా జీవో నెంబర్‌ 46 ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవాలని సూచించారు. విద్య మాఫియా అయిపోయిందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిది పద్మానాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న కార్పోరేట్ స్కూళ్ల దందా నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా గతంలో తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News