Karnataka: కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
Karnataka: ఈ నెల 24 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు ఛాన్స్
Karnataka: కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
Karnataka: కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించగా.. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహకరణకు అవకాశం కల్పించారు. శిగ్గావ్ నుంచి సీఎం బొమ్మై బరిలో నిలిచారు. కనకపురం నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ పోటీకి దిగుతున్నారు. షికారీపుర నుంచి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర, హుబ్లి-దార్వాడ్ నియోజకవర్గం నుంచి షెట్టర్ పోటీలో నిలిచారు. ఇక.. చిన్నపట్నం నుంచి కుమారస్వామి నామినేషన్ వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీకి దిగుతున్నారు. మే 10న ఎన్నికలు జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడనున్నాయి.