Vaccination Policy: వ్యాక్సిన్‌ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం తగదు..

Vaccination Policy: కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని కేంద్రం తెలిపింది.

Update: 2021-05-11 05:05 GMT

Vaccination Policy: వ్యాక్సిన్‌ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం తగదు..

Vaccination Policy: కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని కేంద్రం తెలిపింది. ఈ విషయంలో తాము అనుసరిస్తున్న పాలసీని కేంద్రం సమర్ధించుకుంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పేర్కొంది. నిపుణులైన వైద్య సిబ్బందితో చర్చించి శాస్త్రీయంగా తాము ఈ విధానాన్ని పాటిస్తున్నామని వివరించింది.

ఉన్నత స్థాయిలో జరిగిన, జరుగుతున్న చర్చలే ఈ పాలసీకి ప్రాతిపదిక అని తెలిపింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ విధమైన అంశాలను ఎగ్జిక్యూటీవ్‌కే వదిలివేయాలని, దయచేసి తమ నిర్ణయాలకు అడ్డు రావద్దని కేంద్రం అభ్యర్థించింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలు, వ్యాక్సిన్ డోసుల కొరత, పంపిణీలో జాప్యం వంటి వివిధ అంశాలపై పిటిషన్లు దాఖలు కావడంతో..కేంద్రం తన పాలసీని సమర్థించుకునేందుకు ప్రయత్నించింది.

Tags:    

Similar News