అసోంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తాం : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కుట్రలు పన్నుతున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసోం సమాజంలో చీలకలే తెచ్చే సత్తా ఎవరికీ లేదని బీజేపీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని శివసాగర్‌లో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు.