Risk of Hydroxychloroquine, Azithromycin: ఆ రెండు టాబ్లెట్లు కలిపి వేసుకుంటే ముప్పే.. పబ్లిష్ చేసిన అంతర్జాతీయ జర్నల్

Risk of Hydroxychloroquine, Azithromycin: కరోనా పుణ్యమాని మందుల షాపుల్లో విటమిన్ల మాత్రలు, హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమేసిన్ మాత్రలు లక్షల్లో అమ్మకాలు సాగుతున్నాయి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి లక్షల మంది ఇంటి వద్దే ఉండి వీటిని విచ్ఛలవిడిగా వాడుకుంటున్నారు.

Update: 2020-08-31 03:40 GMT

Risk of Hydroxychloroquine, Azithromycin

Risk of Hydroxychloroquine, Azithromycin: కరోనా పుణ్యమాని మందుల షాపుల్లో విటమిన్ల మాత్రలు, హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమేసిన్ మాత్రలు లక్షల్లో అమ్మకాలు సాగుతున్నాయి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి లక్షల మంది ఇంటి వద్దే ఉండి వీటిని విచ్ఛలవిడిగా వాడుకుంటున్నారు. వీటిలో హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమేసిన్ మాత్రలు కలిపి వేసుకోవడం వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగినా, భవిషత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మలేరియా మందు "హైడ్రాక్సీక్లోరోక్విన్" నియంత్రిస్తోందని ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. దీనితో ఒక్కసారిగా దాని వినియోగం ఎక్కువైంది. హైరిస్క్‌లో ఉన్న బాధితులకు ఈ HCQను వాడుతున్నారు. అయితే ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌పై మరో నివేదిక బయటికి వచ్చింది. దీనికి సంబంధించిన నివేదికను Lancet Rheumatology అనే అంతర్జాతీయ జర్నల్ పబ్లిష్ చేసింది.

కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ టాబ్లెట్స్‌ను కలిపి ఒకేసారి వాడటం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నివేదిక చెబుతోంది. కరోనా డోసేజ్‌లో భాగంగా స్వల్పంగా(20-30 రోజులు) హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని.. అలా కాకుండా HCQను అజిత్రోమైసిన్‌తో కలిపి దీర్ఘకాలికంగా వాడితేనే హృద్రోగ సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు అంటున్నారు.

అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్ దేశాల్లో గత 20 సంవత్సరాలుగా HCQ వాడుతున్న సుమారు 9 లక్షల 50 వేల మంది రోగుల సమాచారాన్ని పొందుపరిచి పరిశోధకులు ఈ రిపోర్టును రూపొందించారు. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని దానికోసం పరిశోధనలు చేస్తున్నామన్నారు. కాగా, హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్‌ను కరోనా చికిత్సలో ఉపయోగించడం వల్ల ఆశించినదగిన ఫలితాలు రావట్లేదని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం విదితమే.

Tags:    

Similar News