Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,603 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 30 Aug 2020 6:08 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,603 పాజిటివ్ కేసులు...
X

Representational Image

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,603 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,603 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,067 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 12, నెల్లూరు 14, కడప 09, అనంతపురం 07, తూర్పుగోదావరి 06, పశ్చిమగోదావరి 07, శ్రీకాకుళం 06, కర్నూలు 05, విజయనగరం జిల్లాలో 05, కృష్ణా 05, గుంటూరు 04, ప్రకాశం 04, విశాఖపట్నం 04, చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,24,767. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,884. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,21,754కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 99,129 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 36,66,422 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.




S. Srikanth

S. Srikanth

Next Story