Corona effect: ఆ పెళ్ళికి వెళ్ళిన వారందరికీ కరోనా టెన్షన్..పెళ్లి పిల్లలతో పాటు 68 మందికి కోవిడ్ పాజిటివ్!

Corona effect: ఆ పెళ్ళికి వెళ్ళిన వారందరికీ కరోనా టెన్షన్..పెళ్లి పిల్లలతో పాటు 68 మందికి కోవిడ్ పాజిటివ్!
x
Highlights

కరోనా ముప్పుతో మూడు నెలలు అన్నిటీకీ తాళం వేసుకున్నాం. బయటకు కదలకుండా కూచున్నాం. క్రమేపీ అన్ లాక్ అంటూ ప్రభుత్వం అందరికీ వెసులుబాటు ఇవ్వడం మొదలు...

కరోనా ముప్పుతో మూడు నెలలు అన్నిటీకీ తాళం వేసుకున్నాం. బయటకు కదలకుండా కూచున్నాం. క్రమేపీ అన్ లాక్ అంటూ ప్రభుత్వం అందరికీ వెసులుబాటు ఇవ్వడం మొదలు పెట్టింది. అంతే, ఒక్కసారే పరిస్థితి మారిపోయింది. దాంతో అంతా రిలాక్స్. ఒకపక్క కరోనా కేసులు పెరిగిపోతున్నా సరే..చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. పెళ్ళిళ్ళు మొదలుకుని అన్ని కార్యక్రమాలూ ప్రజలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. దీంతో కరోనా మరింత విరుచుకుపడుతోంది.

ఇదిగో సరిగ్గా ఇలానే.. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఓవివాహంలో వరుడు,వధువు సహా 68మంది వైరస్ బారిన పడ్డారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని చెక్కి క్యాంపులో ఈ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ ఊరంతా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

15 రోజుల క్రితం జరిగిన ఓ వివాహ వేడుకలో హాజరైన వారికి ఒక్కొక్కరిగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది. టెస్టులు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో 18 మందికి పాజిటివ్ రావడంతో మొత్తం కేసులు 68 కి చేరాయి. ఇప్పటివరకు పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు సహా మొత్తం 69 మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో వివాహ వేడుకకు హాజరైన వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బంధువు జ్వరంతో వివాహ వేడుకల్లో పాల్గోవడమే ఈ ఉపద్రవానికి కారణమని ఊరి జనం భావిస్తున్నారు.

చూశారా..ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో. అన్ని స్థాయిల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories