అమరావతిలో ఇవాళ కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
* మధ్యాహ్నం 2గంటల 22 నిమిషాలకు శాసనమండలి ఛైర్మన్ చేత ప్రమాణం
అమరావతిలో ఇవాళ కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
Amaravati: ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన సభ్యులు ఇవాళ అమరావతి శాసన మండలిలో ప్రమాణాస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారంతో పాటు.. బాధ్యతలను స్వీకరిస్తారు. ఇవాళ మధ్యాహ్నం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కొత్త సభ్యుల చేత లాంఛనాలను పూర్తి చేయించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ సభ్యులు, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, వీవీ సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, ఎస్.మంగమ్మ. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీగా విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ.. చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనురాధను చంద్రబాబు అభినందించారు. తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. పోటీకి దిగి విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు.