AP: సంక్రాంతి కానుకగా గ్రామీణ ప్రాంతాలకు అన్నా క్యాంటీన్లు
ఏపీ రూరల్ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్నాక్యాంటీన్లు గ్రామీణప్రాంతాలైన నియోజకవర్గ, మండల కేంద్రాల్లో.. 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు సన్నాహాలు
AP: సంక్రాంతి కానుకగా గ్రామీణ ప్రాంతాలకు అన్నా క్యాంటీన్లు
ఏపీ రూరల్ ప్రజలకు ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్నా క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణప్రాంతాలైన నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13-15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాల్లో 205 అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. రోజూ వీటిలో మూడు పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పూటకు 5 రూపాయలకే ఆహారం సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లు మంజూరు చేసింది.