నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి వర్ధంతి

దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ వర్ధంతి నేడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజంగా నిలిచారు.

Update: 2025-12-24 06:11 GMT

దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ వర్ధంతి నేడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజంగా నిలిచారు. మల్లీశ్వరి, బొబ్బిలి యుద్ధం, బాటసారి, పెళ్ళికానుక, చింతామణి, సారంగధర, విప్రనారాయణ, ఆస్తిపరులు, మంగమ్మ గారి మనవడు.. వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో తన నటనా ప్రతిభను చూపి తెలుగువారి మనసు దోచారు.

సినీరంగంలో భానుమతిది విలక్షణమైన వ్యక్తిత్వం. ‌ఆమె గాత్రం ప్రత్యేకమైంది. ఆనాడు ఆమె పాటలంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాలలో చివరి వరకు తన పాటలు తానే పాడుకునేవారు. మంచి నృత్య, సంగీత కళా కారిణిగా పేరు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్... వంటి హీరోలు భానుమతితో నటించారు.

తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి.ఎస్. రామకృష్ణారావును 1943, ఆగష్టు 8న ఆమె పెళ్లాడారు. వారి కుమారుడు భరణి. ఆ కుమారుడి పేరుపైనే భరణి స్టూడియోస్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. భానుమతి రాసిన అత్తగారికథలు తెలు

గు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. చిత్ర సీమలో 60 సంవత్సరాలు మకుటం లేని మహారాణిగా మెలిగారు.

భానుమతి ఒంగోలులో జన్మించారు. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. సాహిత్యంలో కూడా ఆమెకు మంచి ప్రవేశం ఉంది. అత్తగారి కథలు వంటి హాస్య కథలు రాసి, తెలుగు సాహిత్యంలో మంచి గుర్తింపు పొందారు. ఈ కథల్లో భానుమతి అత్తగారు, ఆవిడా ధోరణి, మాటతీరు, చాదస్తం దానికి భానుమతి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్పందన ఉంటాయి. కథలు చదువుతుంటే, కొన్ని కొన్ని సందర్భాలలో మన అమ్మమ్మల-నానమ్మల చాదస్తం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ పుస్తకం చదవితే, మీ ఒత్తిడి, బాధలు, కష్టాలు కొంతసేపు మర్చిపోతారని సమీక్షలు రాశారు. చివరకు ఆమె చెన్నైలోని స్వగృహంలో 2005 డిసెంబర్ 24న కన్నుమూశారు. 

Tags:    

Similar News