ACB Raids: అనంతపురం చిలుమత్తూరులో ఏసీబీ సోదాలు

ACB Raids: అనంతపురంలోని చిలుమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Update: 2025-12-24 05:51 GMT

ACB Raids: అనంతపురంలోని చిలుమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమశేఖర్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా సబ్ రిజిస్ట్రార్ నగదు లావాదేవీలు జరిపారనే ఆరోపణతో గతంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో చిలుమత్తూరులోని సోమశేఖర్ ఇంట్లో తనిఖీలు చేసి పలు రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలోని రాజహంస గోల్డ్ హోమ్స్‌లో ఉన్న చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో సోదాలు చేపట్టారు. బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆయా రికార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News