ఇప్పటంతో కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం పర్యటన నేపథ్యంలో ఆ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది.

Update: 2025-12-24 07:27 GMT

మంగళగిరి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం పర్యటన నేపథ్యంలో ఆ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఇచ్చిన మాటను, ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నిలబెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి చేరుకునే ముందు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో ఆ పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్యా మాటా మాటా పెరిగి కొట్లాటకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జనసేన నేతలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఇప్పటంలో జనసేన నాయకుల మధ్య వర్గపోరు నేపథ్యంలో ఈ కొట్లాట జరిగిందని చెబుతున్నారు.


పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ఒక వర్గం మాటలే వింటున్నారని, తమని పట్టించుకోవటం లేదు ఒక వర్గంవారు వాపోతున్నారు. 

Tags:    

Similar News