Kurnool District: కోడుమూరులో ఉపాధి పథకం స్కాం పండ్ల తోటల పెంపులో రూ.20 లక్షల అవినీతి వెలుగులోకి

కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ స్కామ్ పండ్ల తోటల పెంపు పథకంలో రూ.20 లక్షల స్కామ్ 25 మంది రైతుల పొలాల్లో నాటిన మొక్కలు మాయం మొక్కలు మాయమవ్వడంతో ఆడిట్ సిబ్బంది షాక్

Update: 2025-12-24 05:38 GMT

 Kurnool District: కోడుమూరులో ఉపాధి పథకం స్కాం పండ్ల తోటల పెంపులో రూ.20 లక్షల అవినీతి వెలుగులోకి

కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రజావేదికలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పండ్ల తోటల పెంపు పథకం కింద 20 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు సోషల్ ఆడిట్ సిబ్బంది గుర్తించారు. 25 మంది రైతుల పొలాల్లో నాటిన మొక్కలు మాయం కావడంతో ఆడిట్ సిబ్బంది షాకయ్యారు. కనీసం పొలంలో మొక్కల కోసం తీసిన గుంతల ఆనవాళ్లు లేవని ఆడిట్ సిబ్బంది చెప్పారు. నాటిన మొక్కలు వర్షాభావం వలన చనిపోయాయని ప్రజావేదిక సిబ్బంది చెప్పడంతో.. ఆడిట్ తనిఖీకి వచ్చిన అడిషనల్ పీడీ మాధవీలత విస్తుపోయారు. ఉపాధి అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ విషయంపై విచారణకు ఆదేశించారు.

Tags:    

Similar News