కడప-బెంగళూరు రైల్వే లైన్ పూర్తి పనుల్లో టీడీపీ నిర్లక్ష్యం: ఎంపీ మిథున్ రెడ్డి

కడప - బెంగులూరు రైల్వే లైన్ పూర్తి కావటంలో టీడీపీ నిర్లక్ష్యం కనిపిస్తుందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.

Update: 2025-12-24 06:15 GMT

కడప-బెంగళూరు రైల్వే లైన్ పూర్తి పనుల్లో టీడీపీ నిర్లక్ష్యం: ఎంపీ మిథున్ రెడ్డి

కడప - బెంగులూరు రైల్వే లైన్ పూర్తి కావటంలో టీడీపీ నిర్లక్ష్యం కనిపిస్తుందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.

కడప-బెంగళూరు రైల్వే రైల్వే లైన్ పూర్తి కావడానికి స్టేట్ పోర్షన్ నిధులు ఇవ్వందే రైల్వే లైన్ పూర్తి చేయడం కష్టమవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడాన్ని చూస్తుంటే రైల్వే లైన్ పూర్తి కావడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులతో ఎంపీ మిథున్ రెడ్డి ఆత్మీయ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఆరా తీశారు. అధైర్య పడొద్దు పార్టీ అండగా ఉంటుందని ఆయన కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైల్వే పనులు పూర్తి చేయాలని తాము కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కలిశామన్నారు. రైల్వే లైన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, నిధులు కేటాయించాలన్నారు. రాయచోటిలో బీసీ నాయకుడు విజయభాస్కర్‌పై జరిగిన దాడి చాలా దారుణమన్నారు. దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కడప-బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని ఇటీవల తాము కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశామన్నారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ని కోరామన్నారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ లో స్టేట్ పోర్షన్ డబ్బులు ఇవ్వాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదని, ఆ డబ్బులు ఇవ్వందే రైల్వే లైను పూర్తి చేయడం కష్టమవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారన్నారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని, రైల్వే లైన్ పూర్తి కోసం నిధులు కేటాయించాలని తెలుగుదేశం పార్టీని ఆయన డిమాండ్ చేశారు. రాయచోటిలో బీసీ నాయకుడు విజయభాస్కర్ పై జరిగిన దాడి చాలా దారుణమని, దాడి చేసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News