మన్మోహన్ సహా ఏ ప్రధానిలోనూ ఆ క్వాలిటీ లేదు.. ప్రధాని మోడీపై శరద్ పవార్ ప్రశంసలు
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సహా ఏ ప్రధానిలోనూ ఆ క్వాలిటీ లేదు.. ప్రధాని మోడీపై శరద్ పవార్ ప్రశంసలు
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి పాలనపై పట్టుందని, అదే ఆయన బలమని శరద్ పవార్ అన్నారు. పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పవార్ మాట్లాడారు. ప్రధాని తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే విషయంలో అధికారులు, మంత్రులను ఒక్కతాటిపైన నడిపిస్తారని పవార్ చెప్పారు. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోదీ విడిచిపెట్టరని, ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ తదితరుల్లో కనిపించదని అన్నారు.