Narendra Modi: షాంఘై సహకార సమాఖ్య సదస్సులో పాల్గొన్న మోడీ

* ఉగ్రవాదం, తీవ్రవాదంపై సభ్య దేశాలు కలసి కట్టుగా పోరాడాలని పిలుపు * ఆప్ఘన్ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ

Update: 2021-09-17 11:47 GMT

ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటో-ది హన్స్ ఇండియా)

Narendra Modi: షాంఘై సహకార సమాఖ్యకు శాంతి, సుస్థిరత, ఆత్మవిశ్వాసలోపమే శాపాలుగా పరిణమిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు ఆప్ఘనిస్థాన్ లో ఇటీవల జరిగిన పరిణామాలు సమస్యను మరింత జటిలం చేస్తు్న్నాయని వీడియో కాన్ఫరెన్స్ లో భారత బృందానికి నేతృత్వం వహించిన సందర్భంగా కామెంట్ చేశారు తీవ్రవాదం,ఉగ్రవాదం లపై యుద్ధానికి SCO సమాఖ్య గట్టిగా కృషి చేయాలని ఈ సదస్సులో సభ్యదేశాలన్నీ ఈ పోరాటానికి కలసి రావాలని మోడీ కోరారు.

తజకిస్థాన్ లోని దుషాంబేలో జరుగుతున్న ఈ సదస్సులో ఇరాన్, సౌదీ అరేబియా, కతార్ , ఈజిప్ట్ దేశాలు పాల్గొంటున్నాయి. మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరు కాగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ సదస్సుకు హాజరయ్యారు. విరామ సమయంలో భారత, చైనా సరిహద్దు వివాదంపైనా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో చర్చలు జరిపారు.

Tags:    

Similar News