మోడీ, జిన్‌పింగ్ ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యే చాన్స్

Update: 2020-11-08 06:57 GMT

లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధాని మోడీ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సదస్సులో మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆన్‌లైన్‌ ద్వారా ముఖాముఖీ చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్‌పింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

భారత్, చైనా మధ్య లద్ధాఖ్‌ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత ఆరునెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయ్. ఐనా పరిష్కారం లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ, జిన్‌పింగ్‌ ముఖాముఖీలో తలపడే అవకాశం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Tags:    

Similar News