రెప్పపాటులో దూసుకొచ్చిన మృత్యువు.. 2 కార్లపై పడ్డ బండరాయి.. ఇద్దురు మృతి

Nagaland: పలు చోట్ల విరిగిపడ్డ కొండచర్యలు

Update: 2023-07-05 08:10 GMT

రెప్పపాటులో దూసుకొచ్చిన మృత్యువు.. 2 కార్లపై పడ్డ బండరాయి.. ఇద్దురు మృతి

Nagaland: నాగాలాండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి . దీంతో అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. నాగాలాండ్‌లోని చుమౌకేదిమాలో కొండచరియలు విరగిపడ్డాయి. కోహిమా నుంచి దిమాపుర్‌వైపు వెళ్లే నేషనల్ హైవే పై పక్కన ఉన్న ఎత్తైన కొండపై నుంచి ఓ భారీ కొండచరియ రహదారిపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది . దీంతో రోడ్డు పై ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Tags:    

Similar News