Mumbai Airport money laundering scam: ముంబాయి ఎయిర్ పోర్ట్ స్కాంలో ఈడీ దాడులు

Update: 2020-07-28 07:12 GMT

Mumbai Airport money laundering scam: ముంబాయి ఎయిర్ పోర్ట్ స్కాంలో ఈడీ దాడులు. ముంబాయి, హైదరాబాద్ , ఢిల్లీ లతో సహా దేశ వ్యాప్తంగా 9 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న 9 కంపెనీల లావాదేవీల ను ఈడీ పరిశీ లిస్తున్నాయి. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కుంభకోణం కేసులో జీవీకే రెడ్డి, కుమారుడిపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రూ.705 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది.

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు, మరికొందరిపైన సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఒ కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ ఆరోపణ చేసింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలు/వ్యక్తులపైనా కేసు నమోదైంది. ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.

Tags:    

Similar News