Union Cabinet Meet: వంటగ్యాస్ కొరత నివారణకు కేంద్రం కీలక చర్యలు
Union Cabinet Meet: మధ్య ప్రాచ్యంలో యుద్ధ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. వంటగ్యాస్ కొరత రాకుండా తీసుకోవలసిన చర్యలపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు
Union Cabinet Meet
Union Cabinet Meet: వంట గ్యాస్ కొరత నివారణకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ప్రత్యేకంగా చర్చించిన అనంతరం కీలక చర్యలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ మీటింగ్ లో చమురు, వంటగ్యాస్ కొరతపై ప్రత్యేకంగా చర్చించారు. వంట గ్యాస్ కొరత నివారణ కోసం ప్రత్యెక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వంట గ్యాస్ ఉత్పత్తిని 10 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం చమురు కంపెనీలకు ఆదేశాలు ఇస్తారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యెక సూచనలు జారీ చేయనున్నారు.
మొత్తంమీద పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలను తీసుకుంటోంది.