Off The Record : ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కూటమి ముందున్న సవాళ్లు ఏంటి?
Off The Record: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ సవాళ్లు, చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీలోని కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై పూర్తి విశ్లేషణ.
Off The Record
Off The Record: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఇరువురు నాయకులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ముందున్న సవాళ్లు: అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న వేగంతో సాగకపోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
వివాదాలు - విమర్శలు: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిబిఐ (CBI) నివేదిక, టిటిడి చైర్మన్ చుట్టూ ముసురుకున్న వివాదాలు కూటమికి ఇబ్బందికరంగా మారాయి.
వైసీపీ దూకుడుపై: ఈ వివాదాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది
భవిష్యత్తు ప్రణాళిక: పరిపాలనలో అధికారుల జవాబుదారీతనం పెంచడం, వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధిపై దృష్టి సారించాలని అగ్రనేతలు నిర్ణయించారు. పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.