Gas Shortage: ఇరాన్ యుద్ధ ప్రభావం.. భారత్‌లోని పలు నగరాల్లో గ్యాస్ కు బ్రేక్

Gas Shortage: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు భారతీయ హోటల్, ఆహార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.

Update: 2026-03-10 06:42 GMT

Gas Shortage: ఇరాన్ యుద్ధ ప్రభావం.. భారత్‌లోని పలు నగరాల్లో గ్యాస్ కు బ్రేక్

Gas Shortage: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు భారతీయ హోటల్, ఆహార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అకస్మాత్తుగా ఏర్పడిన అంతరాయం కారణంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా బెంగళూరులోని హోటళ్లు తమ కార్యకలాపాలను నిలిపివేశారు. హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఇప్పటికే గ్యాస్ సరఫరాలో 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చాయి. కానీ అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడం హోటల్‌ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ పడిందని హోటల్స్ అసోసియేషన్ అంటోంది. అదే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు బెంగళూరులో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Full View

 

Tags:    

Similar News