VB-G RAM G: మీలో టాలెంట్ ఉందా? లోగో డిజైన్ చేయండి.. కేంద్రం నుంచి రూ. 50 వేలు కొట్టేయండి!

VBG Ramji Scheme Logo Design Contest: దేశంలోని గ్రామీణ ప్రాంత పేదలకు కొండంత అండగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది.

Update: 2026-03-09 10:14 GMT

VB-G RAM G: మీలో టాలెంట్ ఉందా? లోగో డిజైన్ చేయండి.. కేంద్రం నుంచి రూ. 50 వేలు కొట్టేయండి!

VBG Ramji Scheme Logo Design Contest: దేశంలోని గ్రామీణ ప్రాంత పేదలకు కొండంత అండగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. ఈ పథకం పేరును ఇటీవల ‘వీబీ జీ రామ్ జీ’ (VBG Ramji Scheme) గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకానికి సంబంధించి సరికొత్త ‘లోగో’ను రూపొందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక వినూత్న పోటీని ప్రకటించింది.

డిజైన్ చేయండి.. నగదు గెలవండి!

ఈ పథకం యొక్క లక్ష్యాలను ప్రతిబింబించేలా అద్భుతమైన లోగోను డిజైన్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 నగదు బహుమతిని అందజేయనుంది. ఆసక్తి కలిగిన వారు తమ సృజనాత్మకతకు పని చెప్పి ఈ పోటీలో పాల్గొనవచ్చు.

పోటీ వివరాలు ఇవే:

ఎలా దరఖాస్తు చేయాలి: అధికారిక వెబ్‌సైట్ mygov.in లో మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయి మీ డిజైన్‌ను అప్‌లోడ్ చేయాలి.

చివరి తేదీ: ఈ పోటీలో పాల్గొనేందుకు మార్చి 20 వరకు గడువు ఉంది.

విజేత ఎంపిక: నిపుణుల కమిటీ ఉత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి, విజేతకు బహుమతి అందజేస్తుంది.

పని దినాల పెంపుతో రైతు కూలీలకు ఊరట

కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఈ పథకం కింద కల్పించే పని దినాలను కూడా కేంద్రం పెంచింది. ఇప్పటివరకు ఏడాదికి 100 రోజులుగా ఉన్న పని దినాలను, ఇప్పుడు 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు అదనపు ఉపాధి లభించడమే కాకుండా ఆర్థికంగా మరింత వెసులుబాటు కలగనుంది.

Tags:    

Similar News