Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

Madhya Pradesh: బీజేపీ కార్యాలయానికి వెళ్లి నేతలకు నివాళులు

Update: 2023-12-13 06:45 GMT

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్‌లో గవర్నర్​ మంగుభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్​దేవ్డాతో పాటు పులువురు మంత్రులు సైతం ప్రమాణం చేశారు. రాజధాని భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు భోపాల్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు మోహన్ యాదవ్. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్ దీన్​దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

Tags:    

Similar News